KMR: ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో మొత్తం 3,945 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, 2,372 మంది ఉత్తీర్ణత సాధించి 60.13% ఫలితాలను సాధించారు. బాలుర విషయానికి వస్తే, 3,286 మందిలో కేవలం 1,200 మంది మాత్రమే పాస్ అయ్యి 36.52% ఉత్తీర్ణతకే పరిమితమయ్యారు. ఇక్కడ బాలికలు బాలుర కంటే దాదాపు 23% మెరుగైన ప్రదర్శన కనబరిచారు.