HNK: ఈ నెలలో జరగనున్న టూ-డే లీగ్ పోటీల్లో పాల్గొనబోయే ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలను నేడు నిర్వహించారు. సుమారు 150 మందికి పైగా క్రికెట్ క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొని ప్రతిభ చూపగా 26 మందితో ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేశారు. క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని WDCA కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.