NLG: ప్రధాని మోదీ నేతృత్వంలో భారత మత్స్యకార అభివృద్ధి నమూనాకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వకారణమని బీజేపీ నేత ఎల్.వి. రమణ ముదిరాజ్ పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో భారత మత్స్యకార సొసైటీలు, ఎఫ్పీవో ల పనితీరును పలు దేశాలు ప్రశంసించాయని తెలిపారు. నీలి విప్లవం, కేంద్ర పథకాల ద్వారా మత్స్యకారుల జీవనోపాధి పెరిగిందని అన్నారు.