సిద్ధిపేట కమిషనరేట్ పరిధిలోని హుస్నాబాద్ పోలీసులు జీరో ఎన్ఫోర్స్మెంట్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించకుండా, వారికి గులాబీ పూలమాలలు వేసి మర్యాదపూర్వకంగా స్వాగతించారు. చలాన్లు వేయడం కంటే ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రాణాలను కాపాడుతుందని భావించి, వారికి రోడ్డు భద్రతపై కౌన్సెలింగ్ ఇచ్చారు.