BDK: దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామానికి చెందిన దొడ్డాకుల గిరిబాబు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పందించి సర్జరీ కొరకు అవసరమైన లక్ష రూపాయలను ప్రభుత్వం నుంచి LOC ద్వారా మంజూరు చేయించారు. ఆదివారం ఆసుపత్రిలో గిరిబాబును పరామర్శించి చెక్కును అందజేశారు.