TPT: వినికిడి సమస్య ఉన్న ఎందరో చిన్నారుల జీవితాలు చిన్నాభిన్నం కాకుండా TTD ‘శ్రవణం’ పేరుతో కాపాడుతోంది. సాంకేతికతో చెవుడును పోగొట్టవచ్చు. ఇది తెలియని తల్లిదండ్రులు తమ చిన్నారుల విషయంలో నష్టపోతున్నారు. వీరి కోసమే TTD 2006 నుంచి తిరుపతిలోని ఓల్డ్ మెటర్నిటీ ఆసుపత్రి భవనంలో శ్రవణం ప్రాజెక్ట్ ప్రారంభించింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని TTD అధికారులు సూచించారు.