NRPT: నారాయణపేటలో ‘Arrive Alive’ (అరైవ్ అలైవ్) కార్యక్రమంలో భాగంగా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో DIG ఎల్.ఎస్. చౌహన్, కలెక్టర్ ప్రతీక్ జైన్, విద్యార్థులు పాల్గొని రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అధికారులు పిలుపునిచ్చారు.