WGL: వర్ధన్నపేట పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి వైన్ షాపులో సోమవారం ఓ వినియోగదారుడు కొనుగోలు చేసిన బీరు బాటిల్లో చనిపోయిన పురుగు అవశేషాలు, ఫంగస్ ఉన్నట్లు గుర్తించాడు. ఈ ఘటనపై హిట్ టీవీలో కథనం ప్రసారం కావడంతో ఎక్సైజ్ సీఐ స్వరూప వైన్ షాపును సందర్శించారు. అక్కడ బీరు నిల్వలను తనిఖీ చేసి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.