జగిత్యాల సభ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి కేసీఆర్ జగిత్యాలకు బయలుదేరనున్నారు. అనంతరం జగిత్యాల కలెక్టర్ కార్యాలయం సమీపంలోని హెలిప్యాడ్‌లో దిగిన కేసీఆర్, అక్కడి నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తదుపరి సాయంత్రం 6 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుని ప్రసంగించనున్నారు.