MBNR: పాలమూరు విద్యార్థులు కోహినూరు వజ్రాల వంటి వారిని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్. ఎం. ఎం.ఎస్ మెరిట్ పరీక్షలో స్కాలర్షిప్లు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.