KMR: జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో దేవునిపల్లిలో యాత్రికులకు అవగాహన, వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా పాల్గొని, యాత్రికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మత పెద్దలు నియమాలు వివరించగా, ఛైర్ పర్సన్ ఉమాశ్రీనివాస్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, అధికారులు యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.