SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామిని సోమవారం నటి పూనంకౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ప్రపంచ శాంతిలో భారత్ అగ్రగామిగా నిలవాలని, ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక మళ్ళీ స్వామి వారిని దర్శించుకుంటనని తెలిపారు.