MDCL: మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే మరో నెలలో ఫ్రంట్ ఎలివేషన్ పూర్తవుతోందని జూనియర్ ఇంజనీర్ ప్రభాకర్ తెలిపారు. న్యూ డిజైన్ ఎలివేషన్ ప్రస్తుతం రైల్వేలో కొనసాగుతుందని, దీనిని అమలు చేసేందుకు నూతన విధానాలను అవలంబిస్తున్నట్లుగా తెలిపారు. దీనికోసం ప్రత్యేక ఆర్కిటెక్ ఇంజనీర్లు సైతం కృషి చేసినట్లు ఆయన వివరించారు.