SRCL: కోనరావుపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, వార్డు సభ్యులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిమ్మపల్లి సర్పంచ్ స్వప్న, గొల్లపల్లి సర్పంచ్ ఆమని, మరిమడ్ల సర్పంచ్ స్వాతితో పాటు పలువురు వార్డు సభ్యులకు MLA ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.