MDK: ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 వరకు 7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారావు సూచించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, మరమ్మతులు చేపట్టాలన్నారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.