KMM: ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మధిర మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్ల నిండిన బాలికలు ఈ వ్యాక్సిన్ను తప్పకుండా వేయించుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో క్యాన్సర్ నుంచి రక్షణకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.