SDPT: చిన్నకోడూర్ మండలంలోని విఠలాపూర్లో సోమవారం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్య క్రమంలో భాగంగా ఎంపీడీవో జనార్ధన్ పర్య టించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి, మొక్కల పెంపకం, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాణి, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు,గ్రామస్థులు పాల్గొని గ్రామ అభివృద్ధిపై చర్చించారు.