NZB: టీయూ పరిధిలోని ఎం.ఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు నేటితో ముగిసిందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. అపరాధ రుసుం రూ.100తో ఈ నెల 20లోపు చెల్లించేందుకు గడువుందని ఆయన తెలిపారు. పరీక్ష ఫీజులు చెల్లించని విద్యార్థులు చెల్లించాలని పేర్కొన్నారు. ఇది వరకే పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.