PDPL: విద్యార్థులు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని మల్లాపూర్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ అరుణ సూచించారు. ఇవాళ కళాశాలలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆమె సర్టిఫికెట్స్ అందజేశారు. విద్యతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో స్థిరపడతారని తెలిపారు.