WGL: పర్వతగిరి మండలం మాల్య తండా గ్రామంలో నిర్మించిన 3000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును గురువారం సర్పంచ్ భూక్య మంజుల-శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పక్క గ్రామం ఏనుగల్లు సొసైటీలో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను నిల్వ చేయడానికి ప్రభుత్వం ఈ గోదామును కేటాయించినట్లు తెలిపారు. రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.