ASF: దహెగాం మండలం ఖర్జీ గ్రామ పంచాయతీ సర్పంచ్ తుమ్మిడె అంకుబాయి-మల్లేష్, వార్డు సభ్యులు గురువారం కాంగ్రెస్లో చేరారు. MLC దండే విఠల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరామని అన్నారు. MLC మాట్లాడుతూ.. పల్లెలు అభివృద్ధి చెందాలంటే అది ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం అన్నారు.