TG: ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి మంత్రి వివరించారు. రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు.