JGL: కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం తెలుగు నాటక రంగ దినోత్సవ వేడుకలు శ్రీ తారకరామ కళానిలయం నాటక రంగ సభ్యులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు నాటక రంగ పితామహుడు సంఘసంస్కర్త, తొలి నాటక దర్శకుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి అధ్యక్షులు గుగ్గిళ్ళ హనుమయ్య చారి పూలమాల నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.