MNCL: అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో నో హెల్మెట్ – నో ఎంట్రీ అమలు చేశారు. రోడ్డు భద్రతను పెంపొందించడం, హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు డీసీపీ భాస్కర్ ఈ కార్యక్రమం చేపట్టారు. డీసీపీ కార్యాలయం, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేసే సిబ్బంది హెల్మెట్ లేకుండా వస్తే ఆవరణలోకి అనుమతించబడరని తెలిపారు.