SRD: న్యాల్కల్ కేజీబీవీ సీఆర్టీ అనిత కుటుంబానికి టీఎస్ యూటీఎఫ్ జిల్లా శాఖ అండగా నిలిచింది. ఇవాళ సంగారెడ్డిలోని కేకే భవన్లో నిర్వహించిన ఆమె సంస్మరణ సభలో రూ.1.30 లక్షల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ.. మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.