SRCL: వృద్ధురాలిని చంపిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సిరిసిల్ల డీస్పీ నాగేంద్ర చారి తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్లో ఈనెల 13న కోన లక్ష్మి (75) ఇంటిలో నిద్రపోతూ ఉండగా గడిల రాజు ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశాడన్నారు. వృద్ధురాలు లేచి అరవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తెరతో హత్య చేశాడని తెలిపారు.