WGL: వరంగల్లో మామునూర్ ఎయిర్పోర్ట్ను గురువారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సందర్శించారు. కలెక్టర్ సత్య శారదతో కలిసి సమావేశమై రన్వే, టెర్మినల్ సదుపాయాలు, భద్రత అంశాలను సమీక్షించారు. అభివృద్ధి పనులపై అవసరమైన మెరుగుదలలపై చర్చించారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధితో రవాణా, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని అధికారులు తెలిపారు.