NRML: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. కడెం ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గండి గోపాల్ గ్రామానికి చెందిన ఆరె శ్రీను(40) మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 15వ తేదీన పురుగుల మందు సేవించాడు. కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.