KMR: లింగంపేట మండలంలోని మంబాజీపేట్ తండాకు చెందిన మహిళలు శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షుడు సంపత్ గౌడ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బేగరి సాయిలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.