MLG: ఇంటర్లో రాష్ట్ర రెండో ర్యాంకు సాధించిన మనస్వినిని ఇంచర్ల గ్రామ సర్పంచ్ ముశ్నిపెల్లి కుమార్ గౌడ్ శాలువాతో సన్మానించి అభినందించారు. గ్రామానికి గర్వకారణంగా నిలిచినందుకు ప్రశంసలు తెలిపారు. ఇంచర్ల గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని సోషల్ వెల్ఫేర్ సొసైటీలో 2వ స్థానం, కళాశాలలో ప్రథమ స్థానం దక్కించుకుంది.