NGKL: రంగాపూర్ హజ్రత్ నిరంజన్ షావలి దర్గాలో నూతన సమఖానా భవనం నిర్మించాలని దర్గా కమిటీ ఛైర్మన్ రఫీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్లో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజ్మత్ ఉల్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.