NLG: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లను ఆదర్శ రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.లింగయ్య యాదవ్ గురువారం రాత్రి కలిసి వినతి పత్రం అందజేశారు. ఆదర్శ రైతులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతులు పాల్గొన్నారు.