MDK: జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి ఏఆర్ డీఎస్పీ రంగనాథ్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. ప్రతి పోలీసు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు.