ASF: కెరమెరి మండలం జోడేఘాట్లో ఆదివాసీ వీరుడు కొమురం భీమ్ విగ్రహానికి రాష్ట్ర DGP శివధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం 1000 మంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అలాగే “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో 50 మంది ఆదివాసీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాల పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయాన్నారు.