MNCL: జన్నారంలో ఇసుక సేకరణకు ఉద్దేశించిన జీవో ఏడాదికాలంగా పెండింగ్లో ఉంది. జన్నారం అభయారణ్యంలో ఉండటంతో 9 కిలోమీటర్ల మేర ఇసుక సేకరణను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలోకి ఉంచుకుని ఇసుక సేకరణను 9 కిలోమీటర్ల నుంచి ఒక కిలోమీటర్ తగ్గించాలని అటవీ శాఖ అధికారులు గత ఏప్రిల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.