KMM: నగరంలోని 9వ డివిజన్లో నెలకొన్న సమస్యలపై బీజేపీ జిల్లా నాయకులు కుమిలి శ్రీనివాసరావు సోమవారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతిపత్రం అందజేశారు. KMCలో నిర్వహించిన ప్రజావాణిలో పలు సమస్యలను కమిషనర్‌కు విన్నవించారు. డివిజన్లో కొత్త స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, పబ్లిక్ పార్క్ ప్రహరీ గోడపై ప్రమాదకరంగా ఉన్న చెట్టును వెంటనే తొలగించాలని కోరారు.