VKB: దోమ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) స్వర్ణకుమారి ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకొన్నారు. అనంతరం డ్యూటీ రోస్టర్, రికార్డులను పరిశీలించి, సిబ్బంది తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ఫార్మసీని తనిఖీ చేసి, మందుల నిల్వలను చెక్ చేశారు.