ADB: వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణంలో ఈత అభ్యాసం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను పరిశీలించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్, తదితరులున్నారు.