KMR: తాడ్వాయి మండలం నందివాడలోకి ఐస్క్రీమ్ ఆటోలు, బండ్ల రాకను నిషేధిస్తూ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా గ్రామంలోకి ఐస్క్రీమ్ అమ్మడానికి వస్తే రూ. 2,500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ఐస్క్రీమ్ బండ్ల సాకుతో రావడం వల్ల దొంగతనాలు, దోపిడీలు జరిగే అవకాశం ఉందన్నారు.