SDPT: బెజ్జంకిలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్త్ సూపర్వైజర్ సులోచన, ఆశా వర్కర్ రేణుక శుభ్రత పాటించడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం, పోషకాహారం తీసుకోవడం వంటి విషయాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ శ్రీనివాస్, ఉపాధ్యాయులు శంకరాచారి, సిహెచ్ మంజుల, సంతోష ఉన్నారు.