SDPT: అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమావేశాన్ని ఎంపీడీవో జయరాం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.