GDWL: గద్వాల కోర్టు 2018 నాటి రోడ్డు ప్రమాదం కేసులో కీలక తీర్పు వెలువరించింది. గట్టు మండలం చమన్ ఖాన్ దొడ్డి వద్ద అతివేగంతో వాహనం నడిపగా, అది బోల్తా పడి పెద్ద బుచ్చన్న అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆయన మృతికి కారణమైన నిందితుడు సాయికుమార్‌కు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 2000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.