NGKL: కొల్లాపూర్ మార్కెట్ యార్డ్లో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. రైతులకు చెల్లింపులు తక్షణమే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.