CTR: చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆధునికరించిన లెప్రసీ వార్డును బుధవారం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వార్డులో రోగులకు అందుబాటులోకి వచ్చిన సేవలను పరిశీలించారు. రోగులకు ప్రత్యేక పాద రక్షకులు, దుస్తులు పంపిణీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.