NGKL: ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో కల్వకుర్తికి చెందిన షగుప్త నాజ్ అద్భుత విజయాన్ని అందుకుంది. బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే సత్తా చాటింది. క్రమశిక్షణతో కూడిన నిరంతర కృషే తన విజయానికి కీలకమని ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా షగుప్త నాజ్ ప్రతిభను కళాశాల యాజమాన్యంతో పాటు పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.