నిజామాబాద్లో ఆరోగ్య వారోత్సవంలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి ఎయిడ్స్ అవగాహన వాకతాన్ నిర్వహించారు. అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ ర్యాలీని ప్రారంభించారు. హెచ్ఐవీపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు. అనంతరం జీజీహెచ్లో పరీక్షల క్లినిక్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.