SRPT: గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ సర్పంచ్ కడియాల వెంకయ్య వర్ధంతిని సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం పోరాడి అమరులైన వీరుల ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.