WGL: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈనెల 22 నుంచి ప్రతి బుధవారం బంద్ పాటిస్తున్నట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు ప్రకటించారు. ఈ నెల 23 నుంచి క్రయవిక్రయాల సమయాల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 7:05 గంటలకు మిర్చి, 8:05కు పత్తి, 8:15కు పల్లికాయ, 8:30కు పసుపు, 8:45 గంటలకు ధాన్యం, అపరాల బీటు ప్రారంభమవుతాయన్నారు