WGL: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గురువారం శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో గడిపారు. తన కూతురు సుస్మిత పటేల్ కలిసి ఆలయానికి వెళ్లిన మంత్రికి పుజారులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారందరూ కలిసి మల్లికార్జున స్వామి వారికి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.