KMM: గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిచింది. కలెక్టర్ అనుదీప్ పర్యవేక్షణలో ఇప్పటివరకు 3,040 మంది బాలికలకు టీకాలు అందించారు. 14-15 ఏళ్ల వయసులో ఈ టీకా వేయడం వల్ల దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి లభిస్తుందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.